Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభయహస్తం ఫౌండేషన్ ప్రెసిడెంట్ కార్తీక్ చింతలమోరి
- గొత్తికోయగూడెంలో స్మైల్కిట్లు పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి
పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అభయహస్తం ఫౌండేషన్ ప్రెసిడెంట్ కార్తీక్ తెలిపారు. మండలం లో ఫౌండేషన్ దత్తత తీసుకున్న చింతలమోరి గొతి ్తకోయగూడెంలోని లెర్నింగ్ సెంటర్లో బాలలకు ఆదివారం స్మైల్కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఫౌండేషన్ ప్రతినిధులు బాలలతో ఆటవిడుపు కార్యక్రమాలను నిర్వహించారు. తరగతుల నిర్వ హణపై సమీక్షించారు. బాలలకు కేక్ ప్యాకెట్లు, తినుబండారాలు అందించారు. తదనంతరం కార్తీక్ గ్రామస్తులతో మాట్లాడారు. ప్రజలకు అవసరమైన ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు అందించేలా ప్రభు త్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులకు వివ రిస్తామని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధు ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫౌండే షన్ జిల్లా కోఆర్డినేటర్ నిఖిల్, ట్రేసర్ చేతన్, రాజు, సుజిత్, కార్తీక్, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.