Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య
- 'జీడికల్' ఆలయ పాలక మండలి ప్రమాణస్వీకారం
నవతెలంగాణ-లింగాలఘనపురం
చైర్మన్, పాలకమండలి సభ్యులు సంకల్పం తో పనిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. బుధవారం జీడికల్ శ్రీ వీరాచల రామచంద్రస్వామి ఆలయ ఆవరణ లో పాలకమండలి ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యే రాజయ్య హాజరు కాగా ఆలయసిబ్బంది పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడారు. రాష్ట్రంలో ఆలయాల అభివద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. మరో తిరుపతిగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈఓ శేషుభారతి సమక్షంలో చైర్మెన్, డైరెక్టర్ ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, జీడికల్ దేవస్థాన చైర్మన్ సానిక మధు, ఎంపీ టీసీల ఫోరం మండల అధ్యక్షుడు మంగమ్మ యాదగిరి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గణపతి, జనగామ మార్కెేెట్ చైర్మన్ విజయ సిద్ధిలింగం, సర్పంచ్ రాజు, వైస్ ఎంపీపీ కిరణ్ కుమార్, మండల అధ్యక్షుడు నాగేందర్, దిశ మెంబర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.