Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే స్టేషన్ ఎదుట అందోళన
నవతెలంగాణ-గార్ల
రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు, పేద, మధ్యతరగతి ప్రజల కోసం సింగ రేణి రైలును గార్ల రైల్వే స్టేషన్లో యథావిధిగా ఆపాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి గిరిప్రసాద్ రైల్వే అధికారులను కోరారు. సింగరేణి రైలును స్థానిక రైల్వేస్టేషన్లో నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట బుధవారం భారి వర్షంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా సింగరేణి రైలు గార్ల రైల్వే స్టేషన్లో ఆపడం వల్లన అనేక పేదలు అవసరాల కోసం, వివిధ పట్టణాలకు, ఆసుపత్రులకు, విద్యార్థులు కళా శాలలకు వెళ్లేవారని తెలిపారు. కరోనాకు ముందు సింగరేణి రైలును గార్ల రైల్వే స్టేషన్ లో ఆపే వారని కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి రైళ్ల పునరుద్ధరణ అనంతరం సింగరేణి రైలును రైల్వే స్టేషన్లో ఆపక పోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని చెప్పారు. ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవడం వల్ల ఆర్థికం గా నష్టపోతున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి సింగరేణి రైలును గార్లలో ఆపాలని లేదంటే దశలవారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్య క్రమంలో ఉప సర్పంచ్ మహేశ్వరరావు, మండల నాయకులు అంబటి వీరస్వామి, రామకృష్ణ, శ్రీనివాస్, వీరభద్రం, కోటయ్య, శ్రీను, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.