Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
ఎర్రజెండా ప్రజలకు అండగా ఉంటుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఏసిరెడ్డినగర్లో శాఖ కార్యదర్శి పాముకుంట్ల చందు అధ్యక్షతను పార్టీ అనుబంధ ఎన్పీఆర్డీ శాఖ 3వ మహాసభలు బుధవారం నిర్వహించగా కనకారెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో దోపిడీ, అణిచివేత, అవమానాలు ఎదుర్కొంటున్న వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు అందినప్పుడే సమానత్వం లభిస్తుందని తెలిపారు. తద్వారానే వికలాంగులు జీవించడానికి అవకాశాలు పొందుతారని చెప్పారు. వికలాంగులు రాజ్యాధికారం దిశగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్పీఆర్డీకి, వికలాంగులకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వికలాంగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఎన్పీఆర్డీని ఏర్పాటు చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించాయని విమర్శించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో మునుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని పాలకులు పజలకు అండగా ఎర్రజెండా
కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. స్వరాష్ట్రంలోనూ ప్రజలు సమస్యలతో సతమతమౌతూనే ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక మోసపూరిత పాలన సాగిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపీ, శేఖర్, ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి బిట్ల గణేష్, సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యుడు జోగు ప్రకాష్, కార్యకర్తలు ఉప్పరి వేణు, బండవరం శ్రీదేవి, ఇట్టబోయిన మధు, మాలోత్ రాజ్ కుమార్, నాచు అరుణ, మామిడాల రాజేశ్వరి, జరీనాబేగం, ఐలయ్య, మహేష్, మోతె వెంకటమ్మ, పరశురాములు, రమేష్, నామాల రాజు, తదితరులు పాల్గొన్నారు.