Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని సీఎం కేసీఆర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని త్వరలోనే రూ.5 కోట్లతో మంజూరునగర్‌లోని వెయ్యి క్వాటర్స్ వద్ద మోడల్ మార్కెట్‌తోపాటు భూపాలపల్లి నుండి కాసిం పల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 24న భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధానంగా భూపాలపల్లి నుండి చెన్నాపుర్ వరకు ప్రధాన రహదారి వెంట మొక్కలు నాటాలన్నారు. పంచాయ తీరాజ్, ఐబీ, ఆర్అండ్బి శాఖల అధికారులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాలొని మెగా హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కోలెబెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి సింగరేణి ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచారని అన్నారు. ఈ నెల 26న జరిగే బోర్డు మీటింగ్‌లో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో సమావేశం నిర్వహించి పూర్తిస్థాయి ప్రకటన చేస్తారని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ అభివద్ధికి, మౌలిక సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టినట్టు తెలిపారు. భూపాల పల్లి మండలం నేరేడుపల్లి గ్రామం నుండి టేకుమట్ల మండలం గ్రామాల మధ్య రవాణా మెరుగు పరుచుకునేందుకు రూ.7 కోట్లు బ్రిడ్జిల నిర్మాణానికి మంజూరు చేశారన్నారు. భూపాలపల్లి నుండి కాసిం పల్లి వరకు రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టం కు రూ.10 కోట్లు కేటాయించామన్నారు. భూపాలపల్లి పట్టణంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరుకు సింగరేణి చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను కోరామన్నారు. పట్టణంలోని ఎర్ర చెరువు సమీపంలో వ్యవసాయ సరుకుల విక్రయాల కోసం, మంజూరు నగర్ సమీపంలోని సింగరేణి వెయ్యి క్వార్టర్ల వద్ద మార్కెట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని కోటగుళ్ళు, పాండవులగుట్టను పర్యాటక కేంద్రాలుగా గుర్తించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసకెళ్తానని అన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి జెడ్పీవైస్ చైర్పర్సన్ కళ్ళేపు శోభ రఘుపతి రావు, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గేం వెంకట రాణి సిద్ధు, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, టౌన్ మండల ప్రెసిడెంట్ సాంబమూర్తి, రవీందర్ రెడ్డి, కత్తి సంపత్, మనోహర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ బుర్ర రాజు, జెడ్పీటీసీలు గొర్రె సాగర్, పులి తిరుపతి రెడ్డి, జోరుక సదయ్య, ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, ధావు వినోదవీరారెడ్డి, కౌన్సిలర్లు మురళీధర్, రేణుక, రవీందర్, నాయకులు బుర్ర రమేష్ గౌడ్, మందల రవీందర్ రెడ్డి, మలేష్గౌడ్, కటకం జనార్దన్, సమ్మిరెడ్డి, కొక్కుల తిరుపతి,అశోక్, హనుమాన్ టెంపుల్ చైర్మెన్ గడ్డం కుమార్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ పూర్ణచందర్ రెడ్డి, మేకల సంపత్, క్రాంతికుమార్‌రెడ్డి, గండ్ర యువసేన నాయకులు శ్రీకాంత్, రఘు, వెంకటేష్, ముత్తు, రాకేష్, కరాటే శ్రీను, అనిల్, తదితరులు పాల్గొన్నారు.