Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రజెండాతోనే సమస్యలకు పరిష్కారం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు నలిగంటి రత్నమాల
- నక్కలపల్లిలో జెండా ఆవిష్కరించిన జిల్లా
- కార్యదర్శివర్గ సభ్యుడు ఎం చుక్కయ్య
నవతెలంగాణ-ఖిలా వరంగల్
పేదల కోసం సీపీఐ(ఎం) నిరంతరం పోరాటా లు నిర్వహిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యు రాలు నలిగంటి రత్నమాలు అన్నారు. బుధవారం గ్రేటర్ 43వ డివిజన్ నక్కలపల్లిలో పార్టీ నూతన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం చుక్కయ్య ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా రంగశాయిపేట ఏరియా కార్యదర్శి ఎం సాగర్ అధ్యక్షతన జరిగిన సమా వేశంలో ఆమె మాట్లాడారు. నక్కలపల్లి ప్రజలు పార్టీ శాఖను ఏర్పాటు చేసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నా మన్నారు. సీపీఐ(ఎం) పార్టీ అంటే ప్రజలకు ఒక నమ్మకమని తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించాల న్నారు. అనంతరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చుక్కయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలపై భారాలు మోపడంలో ఉన్న శ్రద్ద వారి అవసరాలు తీర్చడంలో లేదని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వాలు ప్రజల బాగోగులు చూసుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ప్రజల కష్టా, సుఖాల్లో పాలుపంచుకుంటాయని, అలాంటి పార్టీని అందరూ ఆదరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ సభ్యులు నలిగంటి అనిల్, ఎస్ దాసు, చిన్న కృష్ణ, శ్రీను, అంజన్య, హరిబాబు, స్వామి తదితరులు పాల్గొన్నారు.