Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్
నవతెలంగాణ-ములుగు
ఫిక్స్డ్ వేతనంపై 30 శాతం పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శ్రావ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ఆశా యూనియన్ జిల్లా కమిటీ సమావేశానికి రాజేందర్ ముఖ్యఅధితిగా హాజరై మాట్లాడారు. జీఓ నెంబర్ 167ను రద్దు చేయాలని, పీఆరీ ప్రకారం కనీస వేతనం రూ.19 వేలు చుఒఉపష్ట్ర్పుఉన ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు ఏడాదిగా ఆశావర్కర్లు ఎనలేని సేవలు అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని విమర్శించారు. ఆశా వర్కర్లకు శిక్షణ ఇప్పించకండానే కరోనా టెస్టులు చేయించిందంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఆశా వర్కర్లకు హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. 2018లో కేంద్రం ప్రకటించిన పారితోషికాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో 106 రోజులపాటు నిర్వహించిన సమ్మె స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. సమావేశంలో ఆశావర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నం నీలాదేవి, జిల్లా సహాయ కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్, శాంతకుమారి, దేవి, పాప, ఆదిలక్ష్మీ, కమల, నళిని, తదితరులు పాల్గొన్నారు.
ఆశావర్కర్ కుటుంబానికి సాయం
రాయినిగూడెం పీహెచ్సీ పరిధిలోని ప్రేమ్‌నగర్ గ్రామ ఆశావర్కర్ నాగావత్ స్వాతి భర్త గోపీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా పీహెచ్సీ పరిధిలోని ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు అతడి కుటుంబానికి డాక్టర్ రవీందర్ చేతుల మీదుగా రూ.11,700లు సాయం అందించారు. కార్యక్రమంలో నీలాదేవి, సీఐటీయూ నాయకులు రాజేందర్, రవిగౌడ్, ధనలక్ష్మీ, మాధవి, చిట్టెమ్మ, ఏఎన్ఎంలు దేవక్క, నాగరాణి, కల్పనా, రమణ, నర్సమ్మ, డాక్టర్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.