Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ చౌహాన్
నవతెలంగాణ-పాలకుర్తి
ఏడేండ్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో తండాలు అభివద్ధికి నోచుకోవడం లేదని, తండాల అభివద్ధిలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లావుడ్య అనిల్ చౌహన్ తెలిపారు. మండలంలోని బిక్యనాయక్ పెద్దతండ పంచాయతీ శివారు దంతాల గడ్డ తండాను బుధవారం ఆయన సందర్శించి తండావాసులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనిల్ చౌహాన్ మాట్లాడారు. జిల్లాలో ఏ తండాకు వెళ్లినా సమస్యలే దర్శనమిస్తున్నాయని తెలిపారు. రోడ్లు, డ్రెయినేజీ, ఇతర సమస్యలతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తండాల అభివద్ధిపై ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లలో 10 శాతం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అభివద్ధి చేయడంలో దష్టి పెట్టడం లేదన్నారు తండాలోని పేదలకు నేటికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు కాలేదని ఆరోపించారు నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీల తో పాటు శివారు తండాలను అన్ని రంగాల్లో అభివద్ధి చేయాలని డిమాండ్ చేశారు తండాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించ కుంటే గిరిజనులను ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లకావత్ లక్కీ నాయక్, లకావత్ మోహన్ నాయక్, బానోతు సుమన్, గుగులోతు వేణు, గుగులోతు రమేష్, బానోతు రాజు, తదితరులు పాల్గొన్నారు.