Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిల్పూర్ ఎంపీపీ సరిత బాలరాజు
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
సమీకత మండల అభివద్ధి కార్యాలయాలు స్థానికంగా చిల్పూర్ మండల కేంద్రంలోనే నిర్మించాలని ఎంపీపీ బొమిశెట్టి సరితబాలరాజు కోరారు. సర్పంచ్ ఉద్దేమారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులతో కలిసి స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజయ్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం, ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన నూతన చిల్పూర్ మండల కేంద్రంలో తహసీల్దార్, ఎంపీడీఓ, రక్షకభట నిలయం, ఇతర ప్రభుత్వ సమీకత కార్యాలయ సముదాయాలను మండల కేంద్రంలోని సర్వే నంబర్ 197 లోని ప్రభుత్వ స్థలంలోనే నిర్మించాలని కోరారు. ఇందుకుగాను మండల ప్రాదేశిక సభ్యులతోపాటు, అన్ని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ సమీకత కార్యాలయాల ఏర్పాటుకు తనవంతు కషి చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల మహేందర్, మూల నాగరాజు, మాచర్ల ప్రవీణ్, పెండ్యాల దిలీప్ కుమార్, రాజన్ బాబు, నారగోని శ్రీను, రాజు, రంగారాజు తదితరులు పాల్గొన్నారు.