Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
కురుస్తున్న వర్షాలకు వరద వచ్చే ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తహసీల్దార్ సయ్యద్ రఫీద్, ఎంపీ డీఓ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సై పత్తిపాక జితేందర్ ప్రజలను కోరారు. గురువారం ఆలేరు, రావిరాల గ్రామాల వద్ద ప్రవ హించే వాగు వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎవరు బయటికి రాకూడదని కోరారు. మండ లంలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వం కలు పొంగి పొర్లి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయని, వరద నీటి ప్రవాహంతో ప్రజలు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది తో కలిసి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల సంబంధించిన విద్యుత్ సమస్య ఉంటే అధికారులకు తెలియజేయాలని కోరారు. గర్భిణీ స్త్రీలు ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఏ గ్రామంలోనైనా నిన్ను పూరి గుడిసెలో పూలే ప్రమాదం ఉంటే ఆయా గ్రామాల లో ఉన్న పాఠశాలలో, లేదా ప్రభుత్వ భవనాల్లో ఆయా గ్రామ పంచా యతీ పాలకులు ప్రజాప్రతినిధులు గ్రామస్థాయి అధికా రులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు మండల స్థాయి అధికారులు మహబూబాద్ నుండి తొర్రూరు వెళ్లే రహదారిలో ఉన్న ఆలేరు. రావిరాల వాగులను పర్యవేక్షించి ప్రమాద సూచిక బోర్డులను గ్రామ పంచాయతీ సిబ్బంది తో పెట్టించారు అలాగే మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరూ చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ బండారి పార్థసారథి, పోలీస్ సిబ్బంది వెంకన్న, వీఆర్వోలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.