Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మహిళలు వయసుతో నిమిత్తం లేకుండా అక్షర భారత్ విద్యా కేంద్రాలలో విద్యనభ్యసించి చైతన్యవంతులు కావాలని వైస్ ఎంపీపీ రామ్శెట్టి లత లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని గంగిరేనిగూడెంలో గురువారం అక్షర భారత్ విద్యా కేంద్రాన్ని మండల కోఆర్డినేటర్ మామిడిపల్లి ఆనంద్ ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా వైస్ ఎంపీపీ పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిరోజు కొంత సమయం కేటాయించి చదువు నేర్చుకోవాలని సూచించారు. జ్ఞానాన్ని, సమాజంపై అవగాహన పెంపొందించుకొని ఉద్యోగులుగా, ప్రజాప్రతినిధులుగా ఎదగాలని సూచించారు. ఎందరో ప్రముఖులు ఆధునిక టెక్నాలజీ వినియోగించుకొని అభివద్ధి చెందుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శానం మంజుల పరమేశ్వర్, మహిళలు పాల్గొన్నారు.