Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాకపోకలు బంద్
- వంద ఎకరాల పత్తి నష్టం ఉప్పొంగిన మోరంచ..
- ఓసీలో నిలిచిన ఉత్పత్తి
- కాలనీ రోడ్లు బురదమయం..
- ఇండ్లలోకి చేరిన వరద నీరు
నవతెలంగాణ-మహదేవపూర్/గణపురం/కోల్బెల్ట్/చిట్యాల
అన్నారం బ్యారేజీ 50 గేట్లు ఎత్తివేసి నీరు దిగువకు వదలడంతో మండలంలోని అన్నారం-సండ్రపల్లి మధ్య ఉన్న వాగు ఉద్ధతంగా ప్రవహిస్తోంది. దీంతో రెండు గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. అలాగే బ్యాక్ వాటర్ వల్ల వంద ఎకరాల పత్తి నష్టం జరిగినట్టు అన్నారం, సండ్రపల్లి, నాగపెళ్లి గ్రామ రైతులు తెలిపారు. గణపురం మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల రైతులకు మండల కేంద్రానికి వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఘనపురం ఎస్సై మాధవ్గౌడ్ వాగును పరిశీలించి మాట్లాడారు. ఎవరైనా మోరంచ వాగు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ ఓపెన్ కాస్ట్-2 గనిలో నీరు చేరడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. రోజువారి ఉత్పత్తి లక్ష్యం నాలుగు వేల టన్నులు కాగా మంగళవారం పాక్షిక ఉత్పత్తే జరగగా, బుధ, గురువారాలు పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలో ప్రధాన రోడ్డు బురదమయమైంది. దీంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి కార్మికుల కాలనీ కావడంతో గతంలో సింగరేణి కాలనీ బాగోగులు చూసేది. ఇప్పుడు కాలనీ బాధ్యతలు భూపాలపల్లి మున్సిపాలిటీ తీసుకోవడం జరిగింది. సింగరేణి ఆధ్వర్యంలో కార్మికుల కోసం 600 ఫ్లాట్లు కేటాయించగా నేడు సుమారు 800 ల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మున్సిపాలిటీ బాధ్యతలు చేపట్టడంతో అభివద్ధి పనుల్లో కాలనీ వెనుకబడిందని స్థానికుల పేర్కొంటున్నారు. కాలనీలో ని రామాలయం వెనుక ప్రధాన రోడ్డు మరమ్మతుకు నోచుకోక ఏండ్లు గడుస్తోంది. ఇటీవల మిషన్ భగీరథ పేరుతో రోడ్డు తవ్వకాలు చేపడట్టారు. వర్షాలతో రోడ్లు, బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతోంద. మున్సిపాలిటీ, సింగరేణి అధికారులు చొరవ చూపి రోడ్లు, సైడు కాలువలు నిర్మించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. చిట్యాల మండలంలో భారీ వర్షాల కారణంగా పలు ఇండ్లల్లోకి వరదనీరు చేరి ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. మండలంలోని జడల్పేట గ్రామ శివారు గాంధీనగర్ గ్రామానికి చెందిన బొనగిరి మమత- తిరుపతి ఇంటిలోకి వరదనీరు చేరింది. ఇంటిలోని సామాగ్రి మొత్తం జలమయమైంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కుటుంబసభ్యులు బిక్కుబిక్కుమంటున్నారు. అధికారులు ఇప్పటివరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. స్పందించి పునరావాసం కల్పించాలని కుటుంబ సభ్యులు కోరారు.