Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
సమాజంలో ప్రజల కష్టాల నుంచి విముక్తి కేవలం ఎర్రజెండా తోనే సాధ్య మని, ప్రజలకు అండగా కమ్యూనిస్టు పార్టీ నిలుస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి వెంకట్రాజ్యం అన్నారు. గురువారం మండలంలోని కుర్చపల్లి గ్రామంలో సీపీఐ(ఎం) శాఖ మహాసభకు గ్రామ శాఖ అధ్యక్షులు మంచాల మల్లేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లా డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) ముందు ఉంటుందని తెలిపారు. ఇందుకు కమ్యూనిస్టులు నిరంతర కష్టపడి పని చేస్తారని తెలిపారు. కరోనా కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవడంలో ఏ పార్టీ చేయలేని కృషి సీపీఐ(ఎం) చేసిందని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ తరుణంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఎనలేని కషి చేశారు అని అది ఒక కమ్యూనిస్టులకే సాధ్యమన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పొదల నాగరాజు, నూతన గ్రామ కార్యదర్శి కాసాని పుల్లయ్య, మండల కమిటీ సభ్యుడు వారాల రాజు, శాఖ కార్యదర్శులు తోకల రాజు, పులిగిల్ల రాజు, తోటకూరి నరేష్; పులిగిల్ల నరేష్, సీనియర్ నాయకులు కాసాని వెంకటయ్య మంచాల అయోధ్య, తోకల ఉప్పలయ్య తోకల యాకయ్య, చెరకు రాములు, కాసాని రాములు తదితరులు పాల్గొన్నార.ు