Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంగిపొర్లుతున్న మేడారం జంపన్న, పోచాపూర్ వాగులు
నవతెలంగాణ-తాడ్వాయి
రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మేడారంలోని జంపన్న వాగు, బంధాల గ్రామపంచాయతీలోని పోచాపూర్ వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు పోటెత్తి ప్రవహిస్తుండటతో జంపన్న, పోచాపూర్ వాగులు జోరుగా ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లోని ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని నార్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎలుబాక, పడిగాపురం, బంధాల గ్రామ పంచాయతీ పరిధిలోని బొల్లెపెల్లి, పోచాపూర్, నర్సాపూర్ (పిఎల్), అల్లిగూడెం గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. పడిగాపూర్, ఎలుబాక గ్రామాలకు ప్రధాన రహదారులైన చింతల్ క్రాస్ వద్ద ఉన్న జంపన్న వాగులో లెవెల్ కాజ్వే, మేడారంలోని కొంగలిమడుగు వద్ద బాగా వరద నీరు పొంగి పోవడంతో రహదారులు మునిగిపోయి ఆ రెండు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయాయి. పోచాపూర్, అల్లిగూడెం, బొల్లేపల్లి, నర్సాపూర్ (పిఎల్) ఆదివాసి గ్రామాలను పోచాపూర్ వాగు పొంగిపొర్లుతుండడంతో అల్లిగూడెం, బొల్లేపల్లి, నర్సాపురం (పిఎల్) పోచాపూర్ ఆదివాసీ గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. దీంతో మేడారం పరిసర ప్రాంతాల్లో గల ఎలుబాక, పడిగాపూర్, పోచాపూర్, బొల్లేపల్లి, అల్లిగూడెం, నర్సాపూర్ గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నిత్యావసర సరుకుల కోసం బయటి ప్రాంతాలకు వచ్చేవారు, జ్వరాల బారిన పడిన గిరిజనులు నాన్న ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల చుట్టూ వరదనీరు చేరుకోవడంతో గిరిజనులు ఇళ్లకే పరిమితమై బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
మండలంలో ప్రమాద హెచ్చరికలు జారీ
బయ్యారం : మండలంలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వలన వాగులన్ని పొంగి పోర్లుతున్నాయి. గురువారం బయ్యారం సిఐ తిరుపతి, ఎంపీడీవో చలపతిరావు, తహసీల్దార్ నాగ భవాని, ఎస్ఐ జగదీష్ మండలంలోని బయ్యారం పెద్ద చెరువు మత్తడి, చింతోణి గుంపు జలపాతం మరియు మొట్ల తిమ్మాపురం బ్రిడ్జ్ ని సందర్శించారు. ఈ సందర్భంగా మొట్ల తిమ్మాపురం గ్రామానికి తాత్కాలికంగా రాకపోకలు నిలిపి వేయడం జరిగినది. చింతోని గుంపు జలపాతం దగ్గరికి ఎవరికి వెళ్ళడానికి అనుమతి లేదని తెలియజేయడం జరిగింది. అతి త్వరలోనే హెచ్చరిక బోర్డులు పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.