Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
బంగాళఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలో జనజీవనం స్తంభించిపోయింది. బయ్యారం చెరువు అలుగు పడి ఎర్ర కాల్వ ద్వారా సీతంపేట సమీపంలోని పెద్ద చెరువుకు భారీగా వరదనీరు చేరుకోవడంతో పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రాంపురం-గార్లకు నిలిచిన రాకపోకలు
భారీ వర్షాలకు పాఖాల చెక్‌డ్యామ్ పొంగి పొర్లడంతో రాంపురం గ్రామానికి, మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. రాంపురం, మద్దివంచ గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామా ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే బయ్యారం, డోర్నకల్ మీదుగా వ్యయ, ప్రయాసలకోర్చి రావాల్సిన పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. చెక్‌డ్యామ్ వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎస్సై బాదావత్ రవి నాయక్, వీఆర్వో అశోక్‌కుమార్ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.