Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజర్వాయర్లలోకి భారీగా నీరు
- మంత్రుల నజర్
- కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు దిశానిర్ధేశం
నవతెలంగాణ-వరంగల్
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 32 గేట్లు తెరిచి 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో దేవాదుల ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ, రామన్నగూడెం వద్ద గోదావరికి పెద్ద ఎత్తున వరద చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు, సరస్వతి (అన్నారం) బ్యారేజీ, లక్ష్మీ బ్యారేజీలకు భారీ వరద చేరుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఇండ్లల్లో నుండి బయటకు రావద్దని అధి కారులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరద ముంపుపై రాష్ట్ర గిరిజన సంక్షేమం మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, నీటి పారుదల శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, మేయర్ గుండు సుధారాణి అధికారు లతో వరద పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలన్నారు. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ములుగు, భూపాల పల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్, మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నందునా వర్షాల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రాల్లో 24 గంటలపాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రాష్ట్రంలో రాగల మూడు,