Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య శాఖ, పోలీస్ శాఖకు ప్రత్యేక కతజ్ఞతలు: సర్పంచ్ వసంత
నవతెలంగాణ-ఎల్కతుర్తి
వీరనారాయణపూర్లో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గినందున సర్పంచ్ వసంత వైద్య, పోలీస్ అధికారు లకు గురువారం కృతజ్ఞతలు తెలిపారు. 22 రోజుల క్రితం వరుసగా ఐదు రోజుల్లో 47 కరోనా కేసులు నమోదయ్యాయి. వారందరూ హోం క్వారంటైన ్లో ఉండి కోలుకున్నారని చెప్పారు. వైద్య సిబ్బంది ప్రతిరోజు పరీక్షలు నిర్వహించి ప్రజలకు తగిన సూచనలు ఇస్తున్నారని సర్పంచ్ వసంత నాగేశ్వరరావు తెలిపారు. 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆమె చెప్పారు. పాలకవర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం అన్ని దుకాణాలు స్వచ్ఛందంగా లాక్డౌన్, కొవిడ్ నిబంధనలు పాటించాయని తెలిపారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ ఫోన్ చేసి కారోనా బాధితులకు మనోధైర్యం కల్పించి, మైరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పినట్లు సర్పంచ్ వివరించారు. బాధితకులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. 20 రోజులుగా గ్రామంలో గోపాల్ పూర్ పీహెచ్సీ వైద్యాధికారులు వారి బందం సేవలు ప్రారంభించారన్నారు. జిల్లా సర్వేలేన్స్ ఆఫీసర్ కష్ణారావు గ్రామాన్ని పరిశీలించి వైద్య, పోలీస్, రెవెన్యూ శాఖ ఇతరుల సేవలు అందించాలని అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ లలితాదేవి గ్రామంలో క్యాంపులు నిర్వహించి అందరికీ పరీక్షలు చేసి కరోనా లేనివారికి వ్యాక్సిన్ అందించాలని సూచించారు. గోపాల్ పూర్ పీహెచ్సీ వైద్యాధికారి శోభారాణి, ప్రతాపరెడ్డి, సూపర్వైజర్ పద్మజ, ల్యాబ్ టెక్నీషియన్ జనార్దన్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎంలు విజయలక్ష్మి, అనురాధ, రాజ్యలక్ష్మి, ఎంసీడీ ఉష, ఆశ వర్కర్లు దేవేంద్ర, సంధ్య, సుకన్య, లత, ఆరోగ్య మిత్ర కట్టయ్య సుధాకర్ శ్రమించి 150మందికి కరోనా వ్యాక్సిన్ అందించారని వివరించారు. అలాగే, కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార నేతత్వంలో ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్ గ్రామంలో మాస్కులు పంపిణీ చేశారు. ఎస్సై ఉమ, ఏఎస్సై ప్రకాశ్, వీఆర్వో, గ్రామ పోలీస్ అధికారి రాజ్ కుమార్ బందోబస్తు నిర్వహించారన్నారు. జీపీ కార్యదర్శి సందీప్, సిబ్బంది సునీల్, ఆనందం, రత్నమ్మ రాజయ్య, అశోక్ పారిశుద్ధ్య పనులు, కిరాణా సరుకులు బాధితులకు చేరవేశారన్నారు. ఆర్ఐ వెంకటేశ్వర్లు, వీఆర్ఏ వీరస్వామి నిరంతరం సేవలందిం చారన్నారు. వీరందరికీ ఉపస ర్పంచ్ పుల్లూరి వెంకట్రావు, వార్డుసభ్యులు చిర్ర రవి, నిమ్మల నాగేశ్వరరావు, కనకం రమేష్, చదిరం కోమల, పుల్లూరి లక్ష్మి, చదిరం సుమలత కతజ్ఞతలు తెలియజేశారు.