Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు
నవ తెలంగాణ- హన్మకొండ
వరుసగా కురుస్తున్న వర్షాలు, రానున్న మూడు రోజుల్లో మరింత భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. కలెక్టర్ గురువారం జిల్లా ఉన్నాతాధికారులతో టెలీకాన్ఫ రన్స్ నిర్వహించి పరిస్థితి సమీక్షించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల వల్ల వరద ఉధతి పెరుగుతున్న నేపథ్యంలో అవసర మైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయా లని కోరారు. రానున్న 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 24గంటలు పనిచేసేలా చూడాలని ఆదేశిం చారు. ఇందుకు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1115 కేటాయించినట్లు తెలిపారు. అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసర మైనచోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ టెలికా న్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో వాసుచంద్ర, అడిషనల్ కమిషనర్ నాగేశ్వర రావు, ఎస్ఈ సత్యనారాయణ, రెవెన్యూ, విద్యుత్ శాఖ, అధికారులు పాల్గొన్నారు.