Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓరుగల్లు వినియోగదారుల రక్షణ సమితి
నవతెలంగాణ-సుబేదారి
ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను అభివద్ధి చేయాలని ఓరుగల్లు వినియోగదారుల రక్షణ సమితి ఉపాధ్యక్షులు తేరాల యుగంధర్ కోరారు. గురువారం ఓరుగల్లు వినియోగదారుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆయుర్వేద బోధన వైద్యశాలను ఉపాధ్యక్షులు తేరాల యుగంధర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. వైద్య శాల సూపరింటెండెంట్ వైద్యశాల సలహా, అభివద్ధి కమి టీని సమావేశపర్చి మెరుగైన వైద్య సేవలందిం చాలని వినతిపత్రం అందించారు. అనంతరం యుగంధర్ మా ట్లాడారు. 2005లో హాస్పిటల్ అభివద్ధి కమిటీ నిర్మా ణం జరిగి నేటికీ వరకు సమావేశము నిర్వహించలే దన్నారు. జిల్లా కలెక్టర్, చైర్మన్‌గా వివిధ జిల్లా అది óకారులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, లో క్‌సభ, రాజ్యసభ సభ్యులు స్వచ్ఛంద సంస్థలు సభ్యు లుగా ఉండి వైద్యశాల అభివద్ధికి పాట ుపడకుండా నిర్ల క్ష్యం వహించారన్నారు. రెండెకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనంలో 100పడకల ఆసుపత్రిగా 61మంది సిబ్బం దికి గాను కేవలం 23 మంది సిబ్బం దితో మాత్రమే వైద్య సేవలందిస్తున్నారని చెప్పారు. సీజనల్ వ్యాధులకు కావల్సిన మందులు అందుబాటులో లేవని ఆవేదన వ్య క్తం చేశారు. సీఎం కేసీఆర్ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన చేస్తున్న క్రమంలో ప్రజా ప్రతిని ధులు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య శాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మలహల్రావు, లింగయ్య, రాజేం దర్, నరసింహరామయ్య, వేణు పాల్గొన్నారు.