Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటిలో మునిగిన పలు కాలనీలు
- రోడ్లన్నీ జలమయం .
- పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు
- ఆందోళనలో ప్రజలు
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పలు కాలనీలు నిటమునిగాయి. డ్రైనేజీ సామర్థ్యం కంటే ఎక్కువ నీరు చేరడం వల్ల డ్రెయినేజీలు నిండి మురుగు నీరు రోడ్లపైకి వచ్చిచేరడంతో రోడ్లన్నీ జలమయ మయ్యాయి. భద్రకాళి చెరువు పూర్తిస్థాయి సామర్థ్యం 14.6 అడుగులు ఉండగా ప్రస్తుతం 14.2 అడుగుల వరకు నీరు చేరి మత్తడి పోస్తోంది. అలాగే, చిన్న వడ్డేపల్లి చెరువు కూడా మత్తడి పోస్తోంది. బుధవారం నుంచి కురి సిన వర్షానికి శివనగర్, ఉర్సు, కరీ మాబాద్, రంగశాయిపేట, ఓఎస్ నగర్, ఎన్ఎన్ నగర్, రామన్న పేట పోతననగర్, అంబేద్కర్‌నగర్, డీకేనగర్, సంతో షిమాత గుడి ప్రాంతాలు నీటితో నిండాయి. రోడ్డు విస్తరణలో భాగంగా ములుగు రోడ్డు నుంచి కాశీబుగ్గ వరకు కొంత మేర భవనాలను కూల్చి వేయ డం, పాత డ్రైనేజీ పూడ్చకపో వడంతో వర్షం నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. వాహన రాకపో కలకు కొంత అంతరాయం కలిగింది. ఆటోనగర్, సాయి గణేష్ కాలనీ, ఎస్సార్ నగర్, ఎమ్హెచ్ నగర్, చాకలి ఐలమ్మ నగర్, ఎన్టీఆర్ నగర్, హన్మకొండ ఇంజనీరింగ్ కాల నీ, చింతగట్టు, పలువేల్పుల, ఎంఎన్ఆర్నగర్, డీజిల్ కాలనీ, జుబ్లీ మార్కెట్, కడిపికొండ, భట్టుపల్లి, సిద్ధార్థ నగర్, వెంకటాద్రినగర్, కాజీపేట దర్గా ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరడం వల్ల నిత్యావసర సరుకులు తడిసి పాడైపోయాయని బాధితు లు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. ఇప్పటికైనా అధికారులు ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టి తమను పునరావాస కేంద్రాలకు తరలించాలని బాధితులు కోరుతున్నారు. .
పలు ప్రాంతాల్లో చెట్లు నేలమట్టం
నగరంలో బుధవారం నుంచి కురిసిన వర్షానికి వడ్డెపల్లిలోని ప్రణరుమార్క్, శివనగర్, గోవిందరా జులగుట్ట, నక్కలగుట్ట, ఫైర్ స్టేషన్, కేఎల్ఎన్ నగర్లో చెట్లు నేలమట్టమయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కూలిపోయిన చెట్లను డీఎఫ్‌వో కిశోర్ అధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బందం సభ్యులు సహాయక చర్యలు చేపడుతున్నారు.