Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
చిల్పూర్ బుగులు వేంకటేశ్వరుని ఆలయ పూర్వ వైభవానికి, అభివృద్ధికి చైర్మెన్, పాలకమండలి సభ్యులు కంకణబద్ధులై ఉండాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆకాంక్షించారు. ఆదివారం ఆలయ ధర్మకర్తల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి హాజరు కాగా, ఆలయ సిబ్బంది ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఛైర్మెన్‌గా పొట్లపల్లి శ్రీధర్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకుని, ధర్మకర్తలు కలకోల పోచయ్య, పొన్నం రజిత, గట్టు చేరాలు, స్వామి, ఎల్లమ్మ, మూల రమేష్, జంగిడి కుమారస్వామి, జి. రవీందర్ రెడ్డి, నిమ్మ రాజిరెడ్డి, మల్లయ్య, కాసాని లింగయ్య, కుంచాల సంపత్ రాజ్, ముక్కెర వీరస్వామి, 13మంది సభ్యులతో ఈఓ లక్ష్మి ప్రసన్న తో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. నూతనంగా మండలం ఏర్పడిన అనంతరం ఎంపీపీగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బొమిశెట్టి సరితబాలరాజు మండల అభ్యున్నతికి, రాష్ట్రంలో ఉత్తమ మండలంగా తీర్చిదిద్దే క్రమంలో చేస్తున్న కషి అభినందనీయమని అన్నారు. అలాగే రాజకీయ విలువలతో ముందుకు సాగిన పొట్లపల్లి చక్రధర్ రావు గారి స్పూర్తితో ఉన్న ఊరు, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సదుద్దేశంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో అహర్నిశలు పాటుపడుతున్నారని ఆలయ నూతన ఛైర్మన్ శ్రీధర్‌రావును ఉద్దేశించి అన్నారు. ఈ ప్రాంత గ్రామ, మండల ప్రజాప్రతినిధులు విషయ పరిజ్ఞానం కలిగి ముఖ్య భూమిక పోషించి, మండల అభివృద్ధి లక్ష్యంగా కార్యదీక్షతో సాగుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే సీడీఎఫ్ నిధులనుంచి రూ.25 లక్షలు ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎడవెళ్లి క్రిష్ణా రెడ్డి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, ఎంపీపీ బొమ్మిశెట్టి సరితబాలరాజు,వైస్ ఎంపీపీ భూక్య సరితనర్సింహ, జడ్పీటిసి ఇల్లందుల బేబీ శ్రీనివాస్, పోలేపల్లి రంజిత్ రెడ్డి, కేశిరెడ్డి మనోజ్ రెడ్డి,ఇల్లందుల సుదర్శన్, సర్పంచ్ ఉద్దేమారి రాజ్ కుమార్, బొట్టు మానసనరేందర్, మామిడాల లింగారెడ్డి, కందుల రఘుపతి, కొంగరి రవి,లోడెం రజితరవీందర్, రూప్లా నాయక్, దివాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు గుర్రపు వెంకటేశ్వర్లు, ఎంపిటిసిల నియోజకవర్గ అధికార ప్రతినిధి జీడి ఝాన్సీ, మారబోయిన ఎల్లమ్మ ఎల్లయ్య, నియోజకవర్గ ఇంఛార్జీ లు రంగు రమేష్, వేల్పుల గట్టయ్య, మాచర్ల గణేష్, రంగు హరీష్, మోతె శ్రీనివాస్, రజిత, ఆనందం, తదితరులు పాల్గొన్నారు.