Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ఇటీవల కురిసిన గ్రామానికి వెళ్ళే వర్షాలకు ప్రధాన రోడ్డు తెగిపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని, చిల్పూర్ మండల పరిధి గార్లగడ్డతండా గ్రామ పంచాయతీ సేవ్య తండా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగిపోయిన రోడ్లతో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇటీవలే వర్షకారణంగా రోడ్లకు కోతలేర్పడ్డాయని, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తూ గుంతలో పడిన ఘటన ఉందని పేర్కొంటున్నారు. స్థానిక సర్పంచ్, అధికారులకు పలువార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.
గ్రామానికి వెళ్దామంటే దారి లేదు
గ్రామంలోకి వెళ్లేందుకు దారి లేదు. సర్పంచ్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం ఓట్లు వేసేటప్పుడు మాత్రమే తండా ప్రజలు గుర్తుకొసారు. అనంతరం వారి సమస్యలు పట్టించు కోరు. ఇప్పటికైనా తండా ప్రజలపై కనికరం చూపి రోడ్డు పనులు పకడ్బందీగా చేపాట్టాలి.
-నునావత్ సుమన్...గ్రామస్థుడు