Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
రాష్ట్రంలో స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పాఠశాలలను భౌతికంగా ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు కే రంజిత్‌కుమార్ యే శ్రీనివాసరావులు కోరారు ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఎస్ యటీఎఫ్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోవిడ్ కారణంగా గతేడాది విద్యా రంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. 18 ఏండ్లలోపు ఉన్న బాలబాలికలకు కోవిడ్ ప్రభావం అంతగా లేదని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఏఎంసీ డైరెక్టర్ రణదీప్ గులేరియా సూచించిన ప్రకారం పాఠశాలలో ఓపెన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితులకు అనుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాత పది జిల్లాల ఆధారంగా బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని కోరారు. 2018 జూలై తర్వాత నియామకమైన వారికి 30శాతం ఫిట్నెస్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న 12వేల ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలను ప్రారంభించే ముందు పాఠశాలల స్వచ్ఛ కార్మికులకు రూ.10వేలు చెల్లించేలా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యావలంటీర్ల నియామకం చేపట్టాలన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా విద్యార్థులు లేరనే సాకుతో పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ఇప్పటికైనా విద్యారంగానికి నిధులు కేటాయించి మరింత అబివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కమిటీ కోశాధికారి వి వెంకటేశ్వర్లు, కార్యదర్శులు జి శ్రీహరి మోహన్, నాయకులు రాజు, నర్సింలు పాల్గొన్నారు.