Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
నవతెలంగాణ-బచ్చన్నపేట
అన్నదాతల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలం లోని పొచ్చన్నపేట గ్రామంలోని పెద్ద వాగుపై రూ.13కోట్లతో నిర్మించిన 3 చెక్‌డ్యా మ్‌లను నాయకులు, రైతులతో కలిసి ఆదివారం సందర్శించి పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు ఎన్నో ఏండ్లుగా గత ప్రభుత్వాలకు విన్నవించుకున్నప్పటికి ఆశలు ఆవిరై పోయాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేసి పెద్ద వాగుపై చెక్ డ్యామ్ లు నిర్మి స్తున్నట్టు తెలిపారు. పనులు పూర్తైతే సమీప గ్రామాల రైతుల బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే పోచన్న పేట గ్రామం పంటల సాగులో ముందంజలో ఉందన్నారు. చెక్ డ్యామ్ లతో మరింత సేద్యం పెరుగుతుందన్నారు. రైతు పంటల పెట్టుబడికి, ఎరువులకు ఏడో దశ రైతుబంధు డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేస్తున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థికస్థితి బాగోలేకున్నా సకాలంలో రైతుబంధు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుం దన్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాబి షేకం చేసారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గూడ సిద్ధారెడ్డి, నాయకులు గిర బోయిన అంజయ్య,తుప్పతి భాస్కర్, ఎంపీటీసీ మామిడి అరుణ ఐలయ్య, జూల కష్ణ, ఎండి ఫిరోజ్, వీరారెడ్డి. మహేందర్ రెడ్డి, బాల చందర్, సిద్ధార్థ గౌడ్, పార్టీ అధ్యక్షుడు బోడిగం చంద్రారెడ్డి సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఎండీ షబ్బీర్ అహ్మద్, ఎంపీటీసీ కర్ణాల వేణుగోపాల్, ఉపేందర్‌రెడ్డి, కిష్టయ్య పాల్గొన్నారు.