Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధికి దూరంగా బంధాల జీపీి
నవతెలంగాణ-తాడ్వాయి
చినుకు పడితే వీధులన్నీ బురదయమవుతున్నదుస్థితి నెలకొంది. ఏదైనా పని నిమిత్తం ఇంట్లో నుంచి కాలు తీసి బయట పెడిదామనుకుంటే రోడ్లన్నా బురదతో దర్శనమిస్తున్నాయి. ఇదీ మండలంలోని బంధాల జీపీ దుస్థితి. మండల పరిధి ఏజెన్సీ గ్రామపంచాయతీ బంధాల జీప పరిధిలో పోచాపూర్, బంధాల, బొల్లెపల్లి, అల్లిగూడెం, నర్సాపూర్ (పిఎల్) ఆదీవాసీ గ్రామాల్లో నేటికీ మట్టి రోడే ్ల దర్శనమిస్తున్నాయి. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. బంధాల ఐటీడీఏ రోడ్డు వద్ద వాగు, నర్సాపూర్, పోచాపూర్ మధ్యలో జోగయ్య వాగులు తెగిపోయాయి. బుల్లెపెళ్లి గ్రామం శివారులో రోడ్డు, మోహనాల గండి రోడ్డు తెగి పోయింది. అలాగే బంధాల, పోచాపూర్, బొల్లేపల్లి, నర్సాపుర్, అల్లిగూడెం ఈ గ్రామాలకు రోడ్లు బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోచాపూర్ కిన్నెరసాని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బంధాల ఆదివాసి గూడా లన్ని జలమయమయ్యాయి. పంట పొలాలు సైతం నీట మునిగిపోయాయి. సీసీ రోడ్లు, డ్రయినేజీలు లేవని, మంచినీటి సరఫరా సక్రమంగా జరగట్లేదని, సుమారు 40 ఏండ్లుగా ఇదే దుస్థితి నెలకొందని స్థానికులు వాపోతు న్నారు. ఏటూర్ నాగారం ఐటీడీఏ పీఓ స్పందించి బంధాల జిపి లోని ఆదివాసి గిరిజనులకు కనీస సౌకర్యాలు, రోడ్లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.