Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని, తన పదవికి రాజీనామా చేస్తే బై ఎలక్షన్లో సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి వరాలు కురిపిస్తారని, నియోజకవర్గంలో అబివృద్ధి పనులు జరుగుతాయని భూపాలపల్లి ఇంఛార్జ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలోని ఎస్వీకేకే ఫంక్షన్ హాల్లో ఆదివారం బీజేపీ మండల అధ్యక్షులు గడ్డం రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఎన్నికలు జరుగుతాయో అక్కడ మాత్రమే వరాలు కురిపిస్తున్నారని, ఈ కారణాలతో అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు వారి ఎమ్మెల్యేలను కూడా రాజీనామాల చేయిస్తే ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ వరాలు కురిపిస్తారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన దక్షత వల్లనే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని తెలిపారు. మండల స్థాయి కమిటీలు పూర్తిస్థాయిలో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జయంతి లాల్, జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకుల మొగిలి, నాయకులు రాజు, రాకేష్ రెడ్డి, రామకష్ణ, మల్లారెడ్డి, సుదర్శన్, మహేందర్, దేవ్ సింగ్, రవి, విజరు, నవీన్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.