Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
దోస్త్ వెబ్ ఆప్షన్లో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధన్యనిచ్చి అత్యుత్తమ విద్యావకాశాలను సద్వినీయోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రమౌళి కోరారు. దోస్త్ వెబ్ ఆప్షన్లపై ప్రచారంతో భాగంగా పలువురు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మాట్లాడారు. నర్సంపేట డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దోస్త్ వెబ్ ఆప్షన్ చేసుకోవడానికి ఈ నెల 28 వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేటలో డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఉన్నందున విద్యార్థులు దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకొనే ముందు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా నేరుగా కళాశాలకు వచ్చి ఉచితంగా పరిష్కరించుకొనే సదుపాయం కల్పించామని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేటలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని చెప్పారు. అన్నింటికీ మించి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వర్చువల్ క్లాస్ రూమ్‌లతో ఈ కొవిడ్ సమయంలో ఆన్ లైన్ ద్వారా నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్స్ ద్వారా బోధనలను అందించామన్నారు. అంతేకాకుండా కళాశాలలో మహిళా ఎన్సీసీ, ఏన్‌సీసీ విభాగం ఉన్నందున విద్యార్థినులు తప్పకుండా కళాశాలలో ప్రవేశం పొంది ఉన్నత స్థితిలో స్థిరపడాలని ఆంకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ సుమతి, సమ్మయ్య పాల్గొన్నారు.