Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వార్థ రాజకీయాల కోసం మండలాన్ని వాడుకోవద్దు
- హన్మకొండ జిల్లాలో కలిపితే ఊరుకునేది లేదు
- కాంగ్రెస్ మండల అధ్యక్షులు, పెద్దాపూర్ ఎంపీటీసీ కమలాపురం రమేష్
నవతెలంగాణ ఆత్మకూర్
ఆత్మకూరు మండలాన్ని వరంగల్ జిల్లాలోనే కొనసాగించాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు, పెద్దాపూర్ ఎంపీటీసీ కమలాపురం రమేష్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజులుగా ఆత్మకూరు మండలన్ని హన్మకొండ జిల్లాలో కలుపడానికి సంతకాలు పెట్టి తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చిన స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రమేశ్ చెప్పారు. ఈ విషయమై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ప్రశ్నించగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచనమేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం సరికాదన్నారు. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల మద్దతుతో నిరసన కార్యక్రమాలు, ఇళ్ల ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆత్మకూరు మండలాన్ని, మండల ప్రజలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వరంగల్ జిల్లాలోని టెక్స్టైల్ పార్క్ో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, చారిత్రక వరంగల్ జిల్లాలో వరంగల్ కోట, ఏనుమాముల మార్కెట్, ఎంజీఎం, సికేఎం, విమానాశ్రయం అలాగే అలాగే రైతులకు, ప్రజలకు కావలిసిన అన్ని వసతులు అందుబాటులో ఉంటాయన్నారు. అందువల్ల ఆత్మకూరు మండలాన్ని వరంగల్ జిల్లా కేంద్రంలోనే కొనసాగాలని ఎమ్మెల్యేను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే ధర్నాలు, ప్రజా ఉద్యమాలు చేయడానికి కాంగ్రెస్ వెనుకాడదని స్పష్టం చేశారు. గూడెప్పాడ్ ఎంపీటీసీ రజనీకర్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్ జిల్లాకే చారిత్రకమైన అనుబంధాన్ని చల్లా విడగొడుతున్నారని చెప్పారు. ఆత్మకూరు మండలాన్ని విచ్చిన్నం చేయొద్దని కోరారు. ఈ కార్యక్రమం లో అక్కంపేట ఎంపీటీసీ ,ఇందిరా రాజి రెడ్డి మాజీ వైస్ %వీూూ% ముద్దం సాంబయ్య మాజీ ఎంపీటీసీ పరికిరాల వాసు, ఉపసర్పంచ్లు వంగల స్వాతి-భగవాన్‌రెడ్డి, వీసం శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ రేవూరి జయపాల్ రెడ్డి, వార్డు మెంబర్లు కాడబోయిన రవి, రాజ్ కుమార్, సీనియర్ నాయకులు పోనిగోటి సత్యనారాయణ, బరుపట్ల కిరీటి, అలువాల రవి, తనుగుల జంపయ్య, ప్రేమ్చెంద్, తోట మహేందర్, ఎలగొండ రాజు, లింగమూర్తి, ప్రభాకర్, రాజు యాదవ్, దేవేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.