Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాట్లో అత్యాధునిక వైద్య సేవలందించడానికి ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని నెక్కొండ రోడ్లో సోమవారం 'న్యూ అమ్మ మల్టిస్పెషాలిటీ' నూతన ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవా దృక్పధంతో వైద్యులు గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ బిల్లులతో వైద్య సేవలందిస్తూ రోగుల అభిమానాన్ని చూరగొంటున్నారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో వైద్య సేవలను మరింతగా కొనసాగించాలని సూచించారు. ఇందుకోసం తమ సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్, వార్డు కౌన్సిలర్ గందె రజిత చంద్రమౌళి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ ఏ.మోహన్‌రావు, డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్ రెడ్డి, డాక్టర్ పీ.గోపాల్, డాక్టర్ జే.ఉదరు సింగ్, డాక్టర్ వీఎం.జయుడు, డాక్టర్ కే.రాజేశ్వరావు, డాక్టర్ రాజారామ్, డాక్టర్ మోహన్, డాక్టర్ పీ.భారతీ, డాక్టర్ కే.ఉజ్వల, డాక్టర్ వీ.సుజాతరాణి, డాక్టర్ పూర్ణిమ, ఆసుపత్రి నిర్వహుకులు, డాక్టర్ బీ.విశ్వనాథ్ నాయక్ (ఎముకలు, కీళ్లు, వెన్నుముక, నరముల ప్రత్యేక వైద్యనిపుణులు, డాక్టర్ బీ.హిమబిందు( పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, తదితర వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.