Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్రంలో పేద ప్రజల కడుపు నింపే యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అన్నార్తులు, అనాధలు ఉండని తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని, తమ ప్రభుత్వం శాశ్వత పథకాల ప్రభుత్వం అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. సోమవారం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మంత్రి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి పర్యటించి కోటి టియుఎఫ్ఐడిసి నిధులతో హైమాక్స్ లైట్స్ ప్రారంభోత్సవం, 13 లక్షలతో ట్రాఫిక్ సిగల్స్ ప్రారం భోత్సవం, 10 లక్షలతో మరుగుదొడ్లకు ప్రారంభోత్సవం, కొత్త రేషన్ కార్డులు పంపిణీ సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని తొర్రూరు, పెద్దవంగర మండలాల లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం శాశ్వత పథకాలపైనే దృష్టి పెడుతుందని అన్నారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం రెండు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని 6863 దరఖాస్తులు ఎంపికచేసి 6035 మంజూరు చేయడం జరిగిందన్నారు. కొత్త రేషన్ కార్డులు పొందలేని వారికి మరొక అవకాశం కల్పించడం జరుగు తుందని తెలియజేశారు. పింఛన్లు రెండు పడక గదుల ఇండ్లు కూడా ఇవ్వాల్సి ఉందని బడ్జెట్లో ప్రవేశపెట్టామని అన్నారు. దళితుల అభ్యున్నతికి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే పథకం ప్రవేశపెట్టామని త్వరలో లబ్ది దారులను ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో లో ఒక లక్ష 37 వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మాత్యుల సహకారంతో 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీలలో వచ్చే విధంగా కృషి చేశామన్నారు. కరోనా తో ఇబ్బందులు ఉన్న రాష్ట్రం అప్పు తెచ్చి పథకాలు కొన సాగించిందని గుర్తు చేశారు. తాగునీటి పథకం లో భాగంగా 40 వేల కోట్లతో గోదావరి నీటిని మిషన్ భగీరథ పథకం తో ఇంటింటికి అందించామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు కూడా ఇస్తున్నామన్నారు. 6 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మాణం చేపట్టామన్నారు. రెండు సంవత్స రాలుగా జ్వరాల నియంత్రణ దేశంలోనే తెలంగాణకు పేరు తెచ్చిపెట్టింది అన్నారు. హాస్పిటల్స్ అభివద్ధి పరచి అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసి నిరుపేదలకు అందుబాటులో ఉంచామన్నారు. రూ.40 లక్షలతో ఆనందయ్య మందును ఇంటింటికి పంపిణీ చేశామన్నారు. వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం అంతర్జాతీయ స్థాయి కీర్తి నార్జించిన దని తెలియజేశారు. తొర్రూరు, పెద్దవంగర జెడ్ పి టి సి లు మంగళపల్లి శ్రీనివాస్, శ్రీరామ్ జ్యోతిర్మరు సుధీర్ బాబు, ఎంపీపీలు తొర్రూరు, పెద్దవంగర తూర్పాటి చిన్న అంజయ్య, ఈదురు రాజేశ్వరి ఐలయ్య, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, ఆర్ డి ఓ రమేష్, మండల ప్రత్యేక అధికారి రవీందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, సివిల్ సప్లై ఈస్ డి టీ నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, పెద్దవంగర, తొర్రూరు రెండు మండలాల తాసిల్దార్లు సరితారాణి, వేమిరెడ్డి రాఘవరెడ్డి పాల్గొన్నారు.