Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులకు బాధిత రైతు ఫిర్యాదు
నవ తెలంగాణ-మల్హర్ రావు
పది, ఇరవై ఏళ్లక్రితం భూములు అమ్ముకొని ఇప్పుడు భూములకు విలువలు పెరిగే సరికి అమ్ముకున్న దుర్మార్గులు కొంతమంది భూములకు ఎదురు తిరుగుతూ బెదిరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తాడిచెర్ల గ్రామానికి చెందిన బాధిత రైతులు తాండ్ర మార్కు, తాండ్ర సంతోష్ సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణికి విన్నవించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ తాడిచెర్ల గ్రామంలో తాతల కాలంలో అపతికి అమ్ముకొని ఇప్పుడు భూములకు ధరలకు రెక్కలు రాగానే మాకు భూమి ఉంది, మేము అమ్మలేదని అబద్దాలు చెప్పడమే కాక భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. కాపురం శివారులో 92సర్వే నంబర్ లో 6ఎకరాల భూమి తమ తండ్రి తాండ్ర రాజపోచం 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి పట్టా పత్రాలు మోకాపై ఆయా పంటలు పండించుకొని బతుకుతుంటే ఇప్పుడు అమ్మినవారి మనువలు మాకు భూమి ఉందని, అమ్మలేదని నాలుగేళ్లగా తమను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఇదే కాక తాడిచెర్ల లో ఇలాంటి దుర్మార్గులు కోకొల్లలు ఉన్నారని వారిపై చర్యలు తీసుకొని బాధిత రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.