Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-చెన్నారావు పేట
మండల కేంద్రంలో ఎం సీపీఐయూ ఆధ్వర్యంలో సోమవారం ఛలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చెన్నారావుపేట మండల నాయకులు జన్ను రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి మాట మార్చడం సిగ్గుచేటుగా ఉందన్నారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి గాలికి వదిలేశారని మండిపడ్డారు. జీవో నంబర్ 13నమోదుచేసి ప్రభుత్వ భూములను కార్పొరేటు సంస్థలకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వం వాటిని అమ్మడంలో ముందుకు పోవడం సరైన పద్ధతి కాదని చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చలేని ప్రభుత్వం గద్దె దిగిపోవాలన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనాతో చనిపోయిన వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి, జీవో నంబర్ 13ను రద్దుచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంసీపీఐ మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.