Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీవీ, పాపారావు, మాజీ ఐఏఎస్
నవ తెలంగాణ-హన్మకొండ
రామప్ప వారసత్వ గుర్తింపు రావడానికి దశాబ్ద కాలం ప్రయాణించిన తర్వాత ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించిందని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రారంభకులు మాజీ ఐఏఎస్ బీవీ పాపారావు తెలిపారు. సోమవారం హరిత హౌటల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాపారావు మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం 2010లో అప్పటి సాంస్కతిక శాఖ మంత్రి గీతా రెడ్డి ఆధ్వర్యంలో హెరిటేజ్ సమన్వయకర్తలుగా జీవో నంబర్ 415 విడుదల చేసి అధికారికంగా ప్రభుత్వం ఒక ట్రస్టు ఏర్పాటు చేసిందని తెలిపారు. దీనికి ప్రారంభ సమయంలో కాకతీయ వారసత్వ ప్రతిపాదనలు ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి గీతారెడ్డి ఎంతగానో కషి చేశారని ఆయన అన్నారు. కాకతీయ వారసత్వాన్ని ప్రోత్సహించడానికి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చేస్తున్న కషి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో మరింత ఊపందుకుందని తెలంగాణ ప్రభుత్వ సహాయంతో 2016లో నామినేషన్ ప్రచారాన్ని ప్రారంభించిందని కానీ, సీఎం కేసీఆర్ మోడీతో మాట్లాడి కాకతీయ కట్టడాల ప్రాముఖ్యతను వివరిస్తూ అధికారికంగా లేఖ ఇచ్చారని ఆయన తెలిపారు. రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడం వరంగల్ ప్రజలకే కాకుండా యావత్ దేశానికి గర్వకారణమని పాపారావు అన్నారు. 2019 యునెస్కోకు భారత దేశం తరపున నామినేషన్ సమర్పించామని, నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న సాంస్కతిక శాఖ మంత్రి, ఇతర సభ్యులకు ఆయన కతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సహాయంతో భారత రాయబారి విశాల్ శర్మ కషివల్ల ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడానికి ఎంతగానో దోహదపడిందని వారందరికీ కతజ్ఞతలు తెలుపుతున్నట్లు పాపారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధరరావు, వరంగల్ టూరిజం శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.