Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-నల్లబెల్లి
వే పౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సరస్వతి పరిషత్ భవన్ హైదరాబాదులో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కొలిపాక సంగీతకు రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యాదయ్య చేతుల మీదుగా వరల్డ్ అచీవర్స్ 2021 అవార్డును అందుకున్నారు. అదేవిధంగా ఆదివారం వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని త్యాగరాయగాన సభలో నిర్వహించిన కార్యక్రమంలో స్వామి వివేకానంద లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు 2021 వల్లూరి ఫౌండేషన్ అధ్యక్షుడు వీఆర్ శ్రీనివాస్ సంగీతకు అందించారు. వివిధ సేవా రంగాల్లో విశిష్ట ప్రావీణ్యత గల వారిని గుర్తించి ఈ అవార్డు ఇస్తారని తెలిపారు. 19 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేసుకుంటూ, ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినందుకు గాను ఈ అవార్డులు ఇచ్చినట్లు ఆయా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు తెలిపారు. కార్యక్రమంలో సంగీత మాట్లాడుతూ ఈ అవార్డులు రావడం చాలా గర్వంగా ఉందని, తనపై మరింత బాధ్యతను పెంచిందని చెప్పారు. ముందు ముందు ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. అవార్డు అందించిన సంస్థల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డులు అందుకున్నందుకు గాను నల్లబెల్లి మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామస్వామి, పీఆర్టీయూటీఎస్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఫలితా శ్రీహరి, తోటి ఉపాధ్యాయులు ఈ సందర్భంగా సంగీతకు శుభాకాంక్షలు తెలిపారు.