Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐనవోలు
మండలంలోని వెంకటాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదాం దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడుకుందాం అని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బొక్కల రవిబాబు తెలంగాణ రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు కొంకాల నారాయణరెడ్డి అన్నారు. సోమవారం సీఐటీయూ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వెంకటాపురం గ్రామ బస్టాండ్ సెంటర్లో సేవ్ ఇండియా అనే నినాదంతో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బొక్కల రవిబాబు నారాయణ రెడ్డి హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలను ఉపసంహరించాలని సుమారు 250 రోజులుగా ఢిల్లీ నడిబొడ్డున రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోవడంలేదని అన్నారు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 42 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్ చేసి కార్మిక హక్కులను కాల రాస్తుందన్నారు. వ్యవసాయ కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న గ్రామీణ ఉపాధి చట్టానికి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తుందని అన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే మోడీ ప్రభుత్వా పైన దానికి మద్దతు తెలుపుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పై రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సేవ్ ఇండియా కార్యక్రమం గ్రామ సర్పంచ్ ల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అని అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు వ్యవసాయ సీఐటీయూ నాయకులు దీకొండ ఉప్పలయ్య, యాకయ్య రాయపురపు కొమురయ్య, నరసయ్య పాల్గొన్నారు.