Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రయివేటే పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండల ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడు తూ పాఠశాల ఫీజుల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కరోనా పరిస్థితులలో ట్యూషన్ ఫీజు మాత్రమే తెలుసుకోవాల్సిన ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలు వాటికి భిన్నంగా ఆన్ లైన్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. ఫీజులు చెల్లించని విద్యార్థులకు ఆన్లైన్ లింక్ కట్ చేస్తూ చదువుకు దూరం చేస్తున్నారన్నారు. విద్యార్థులు, వారి తల్లిదం డ్రులను మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమని విమర్శించారు. అంతేకాకుండా వారి నుండి వారిని అధిక ఫీజులు దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వం నెలవారీగా ట్యూషన్ ఫీజులు తీసుకోవాలి అని చెప్పినా కూడా పాఠశాలల యాజమాన్యం మాత్రం లెక్కచేయకుండా ఫీజులు వసూలు చేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వం చెప్పిన మాటలు మాత్రం కేవలం కాగితాలకే మాత్రమే పరిమితం అయింది ఆచరణలో లేదన్నారు. వరంగల్ రూరల్ జిల్లా లో కొన్ని పాఠశాలలు మాత్రం ఆరు నెలల ఫీజును ముందుగానే వసూలు చేస్తున్నారని తెలిపారు. ఫీజుల నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యపట్టారు. కమీషన్లకు కక్కుర్తిపడి అట్టి పాఠశా లలపై చర్యలు మాత్రం తీసుకోవడం ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రతి పాఠశాలలో పాఠశాలలపై చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు శ్రావణ్, వినరు, రాజ్ కుమార్, హర్ష, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.