Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
కేంద్ర ప్రభుత్వ చట్ట వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాజీపేట రైల్వే కార్మికులు రైల్వే కార్యాలయల ఎదుట సోమవారం నిరసన తెలిపారు. టెక్నికల్ బ్రాంచ్ కార్మికుల ఆధ్వర్యంలో ఏఐఆర్ఎఫ్ పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్ రావు, డివిజన్ సెక్రటరీ రవీందర్ ఆదేశాల మేరకు సోమవారం కాజీపేట టెక్నికల్ బ్రాంచ్ కార్మికులు దిక్కార దివస్ పాటిస్తూ నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా కాజీపేట టెక్నికల్ బ్రాంచ్ సెక్రటరీ సమ్మయ్య మాట్లాడుతూ.. ఏఐఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా ఫోను రహస్యంగా ట్యాపింగ్ చేయడం చట్ట వ్యతిరేకమైన చర్య అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పౌర హక్కులకు భంగం కలిగించే నైజం సరికాదని చెప్పారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని, దీనిని కార్మిక సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రాజు, ట్రెజరర్ సదాశివ, ఆఫీస్ బేరర్లు రఘు, రాజు, అనిల్ కుమార్, హరీష్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ లోకో షెడ్లో..
ఏఐఆర్ఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపుమేరకు శివ గోపాల్ మిశ్రా ఫోన్ను ట్యాపింగ్ చేస్తూ, ఆయన వ్యక్తిగత మనోభావాలకు భంగం కలిగిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ చట్టవ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సోమవారం ఎలక్ట్రికల్ లోకో షెడ్ క్యాంటీన్ దగ్గర కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ కార్మికులు ధిక్కార్ దివస్ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఈఎల్ఎస్ చైర్మన్ నాయకులు నాయిని సదనదం సెక్రటరీ రవీందర్, ట్రెజరర్ పసరగొడ రమేష్, ఆల్ ఆఫీస్ బేరర్స్ కార్మికులు పాల్గొన్నారు.