Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు నియోజకవర్గం లోని రామప్ప దేవాల యానికి యునెస్కో గుర్తింపు లభించడం భారత జాతి గర్వించదగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ నాయకులు కొనియాడారు. సోమవారం మండల కేంద్రంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల నాయకులు మాట్లాడారు. నాటి కాంగ్రేస్ హయాంలో కాకతీయ శిల్ప కళను ప్రపంచానికి తెలియ పర్చేందుకు కృషి చేసినట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రామప్ప రుద్రేశ్వర ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం కృషి చేసిన పాండు రంగా రావు, పాపారావు శ్రీనివాస చార్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, పీఏసీఎస్ చైర్మెన్ పన్నల ఎల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు కణతల బుజ్జి నాగేందర్ రావు, పాలడుగు వెంకట కష్ణ, జంపాల చంద్ర శేఖర్, జెట్టి సోమయ్య, సూది రెడ్డి జెనార్ధన్ రెడ్డి, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, చల్వాయి ఎంపీటీసీ గుండెబోయిన నాగ లక్ష్మీ- అనిల్ యాదవ్, పస్రా ఉపసర్పంచ్ బద్దం లింగ రెడ్డి ,యూత్ నాయకుడు పెండం శ్రీకాంత్ పాల్గొన్నారు.