Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కడుపు నిండా అన్నం పెట్టాలనేదే సీఎం లక్ష్యం
- టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి
- పేద కుట్ణుంబాల్లో భరోసా నింపేందుకే కొత్త పథకాలు
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు
- మండలంలో 374 ఆహార భద్రత కార్డులు పంపిణీ
- ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో40 లక్షలతో ఆనందయ్య మందు పంపిణీ
నవతెలంగాణ-రాయపర్తి
భారతదేశ చరిత్రలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం పేద ప్రజలకు మూడు పూటలు కడుపునిండా అన్నం పెట్టాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఆహారభద్రత కార్డుల పంపిణీ చేపట్టింది. మండల కేంద్రంలోని రాయపర్తి క్లస్టర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి ఎర్రబెల్లి జిల్లా కలెక్టర్ హరితతో కలిసి లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ మితంగా ఉన్నప్పటికీ లక్ష 75వేల మందికి 107 కోట్ల రూపాయలతో రైతుబంధు ఇచ్చినట్లు తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా 5740 ఆహార భద్రత కార్డులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ లబ్ధిదారునికి ఆహారభద్రత కార్డు ఇవ్వడం ఇస్తున్నామని చెప్పారు. కరోనా లాక్ డౌన్.. కష్ట కాలంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పాక్షికంగా ఇస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. ఆరోగ్యకరమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ప్రజలకు బియ్యం పంపిణీ చేయడంతో పాటు అంగన్వాడీ సెంటర్ల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందిస్తుందని వివరించారు. పల్లె ప్రగతితో పల్లె సీమలు సర్వాంగ సుందరంగా మారుతున్నాయన్నారు. రైతులకు నాణ్యమైన 24గంటల కరెంట్, రైతుబంధు వంటివి ఎన్నో అమలవుతున్నాయని తెలిపారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40లక్షల రూపాయల వ్యయంతో ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలదే తన అభిమతం అని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఏఓ వీరభద్రం, ఎంపీవో రామ్మోహన్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహానాయక్, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, సురేందర్ రావు, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్, బిల్లా రాధిక సుభాష్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగరాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.