Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
రైతులు సాగు విధానంలో నూతన పద్ధతులను అలవ ర్చుకోవాలని మహబూబాబాద్ ఏడీఏ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం కేసముద్రం మండల వ్యవసాయ అధికారి వెంకన్నతో కలిసి మండలంలోని అన్నారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో మూడు ఎకరాల్లో డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు నాటే విధానాన్ని పరిశీలిం చారు. ఈ విధానం ద్వారా ఎకరాకు 15 కేజీల విత్తనాలు మాత్రమే సరిపోతుందని, కూలీల కొరత అధికంగా ఉండడం వల్ల నేరుగా వెదజల్లే పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధించొచ్చని తెలిపారు. కలుపు నివారణ చర్యలు పాటించి సాధారణ పద్ధతి కంటే ఎక్కువ దిగుబడులు సాధించొచ్చని తెలిపారు. నారు పోసే అదును దాటి పోయినందున స్వల్పకాలిక రకాలను డ్రమ్ సీడర్, నేరుగా వెదజల్లే పద్ధతులు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం వైస్ ఎంపిపి రావుల నవీన్ రెడ్డి, గ్రామానికి చెందిన ప్రకాష్, మహబూబాబాద్ ఎఓ ఎన్ తిరుపతిరెడ్డి, ఎఈఓ మమత తదితరులు పాల్గొన్నారు.