Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ సుకుమార్
నవతెలంగాణ-గోవిందరావుపేట
వర్షాలు విస్తృతంగా కురిసి జలాలు కలుషితమవ్వడంతోపాటు పరిసరాలు కూడా పిచ్చి మొక్కలతో పేరుకుపోయాయని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ సుకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని రంగాపురం గ్రామం లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వేడిచేసి చల్లార్చిన నీటిని తాగి ఆరో గ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు. కరోనా ప్రభావం తగ్గినందున జాగ్రత్తలు పాటించాలని, మాస్క్ విధిగా ధరించాలని సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. జలుబు జ్వరం, దగ్గు ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకుని తగిన మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు నాగేశ్వరరావు శకుంతల అనిత తదితరులు పాల్గొన్నారు.