Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎస్పీ గౌస్ ఆలం
నవతెలంగాణ-మంగపేట
యువత రక్తదానానికి ముందుకొచ్చి చావు బతుల మధ్య ఉన్న వారిని ఆదుకునేలా మానవత్వం చాటాలని ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం అన్నారు. శుక్రవారం జ్వాల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిభిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన రక్తదాన శిభిరం వంద యూని ట్లకు పైగా రక్తదానం చేసి విజవంతమయిందన్నారు. ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పటల్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కోవిడ్ సెంకడ్, ధర్డు వేవ్ పరిస్థితుల్లో ఎందరో కోవిడ్ రోగులకు అత్యవసర సమయంలో రక్తం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందు బాటులో ఉంటుందని అన్నారు. అనంతరం జ్వాలా యూత్ అధ్యక్షుడు కోడెల నరేష్ మాట్లాడుతూ ఏజెన్సి ప్రాంతంలో రక్తం అందక చాలా మంది ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతుండడంతో తమవంతు రక్తదానం శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఏఎస్పీ గౌస్ఆలం, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఇంచార్జ్ ఎస్సై రాజేష్ రెడ్డి, ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్, మంగపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నాగేష్ నాయక్ సహకారంతో రక్తదాతలకు పండ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ ఎండీ షకీల్ పాషా, ఏటూరు నాగారం బ్లడ్ బ్యాంక్ ఇంచార్జీ మురళి, డాక్టర్ స్వాతి, ఆసుపత్రి సిబ్బంది, క్రాంతి, జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ బంద సభ్యులు పాల్గొన్నారు.