Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం, ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ-కురవి
గిరిజన మహిళ కేతావత్ భామిని బారు హత్యాచార ఘటన నింధితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కిషన్ నాయక్, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జ్యోతి బస్ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం మండల కేంద్రంలోని గుడి సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్ర బండ తండాకు చెందిన కేతావత్ భామిని బతుకుతెరువుకోసం మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం మంగంపేటలో ప్రతిరోజు పనులకు వెళ్తున్నదని, కూలిపని చూపిస్తామని కొంతమంది నాలుగు రోజుల క్రితం తీసుకెళ్లారన్నారు. మల్లంపేటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్ళి హత్యాచారం చేశారని, దుండగులు తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.20లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్‌నాయక్, కళ్యాణ్ వాసు, మురళి, వెంకి, వర్షిత్‌రెడ్డి, దేవేందర్, గున్న, బద్రు, తదితరులు పాల్గొన్నారు.