Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్
నవతెలంగాణ-బయ్యారం
పోడు భూములు, అసైన్మెంట్ భూముల జోలికి ఫారెస్ట్ అధికారులు వెళ్లొద్దని కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ అన్నారు. శుక్రవారం మణుగూరు పర్యటనకు బయలుదేరిన ఆయన బయ్యారం మార్గమధ్యలో కార్యకర్తల్ని కలిసి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బలరాంనాయక్ మాట్లాడుతూ... పోడు భూముల సమస్య, అసైన్మెంట్లు భూముల జోలికి రావొద్దని ఫారెస్ట్ అధికారుల్ని కోరారు. ఇల్లందు ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉపఎన్నికలు వస్తే దళితులకు రూ10 లక్షలు వస్తాయని, ఇల్లందు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో గెలిచి అభివద్ధి పేరిట పార్టీ ఫిరాయించి అధికార పార్టీకి వెళ్ళిందని అన్నారు. ఈ ప్రాంతం అభివద్ధికి నోచుకోలేదని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తే నియోజకవర్గాలు బాగుపడతాయని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చనప్పటి నుంచి కొత్తగా వద్ధులకు, వికలాంగులకు, నిరుద్యోగ భతి దాదాపుగా మూడో సంవత్సరం అవుతున్న పింఛన్ ఇవ్వట్లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి, ఎంపీటీసీ బాణోత్ మోహన్ జి, సీనియర్ నాయకులు కొవ్వూరు దామోదర్ రెడ్డి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు కొండపల్లి లక్ష్మి, జిల్లా నాయకులు రాము నాయక్, సింగారం గ్రామ శాఖ అధ్యక్షులు గంగావత్ రవి నాయక్, మండల యూత్ అధ్యక్షులు చాట్ల సంపత్, తదితరులు పాల్గొన్నార