Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
- ఎనీ టైం గుడుంబా లభ్యం
- ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళలు
నవతెలంగాణ-చిట్యాల
మండల కేంద్రంలో గుడుంబా అమ్మకాలు విచ్చల విడిగా కొనసాగుతున్నా ఎక్సైజ్‌శాఖ వారు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండల కేంద్రంలోని మహిళలు ఆ రోపిస్తున్నారు. రాష్ట్రాన్ని గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చి దిద్ది గుడుంబా తయారీ దారులకు స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ గు డుంబా విక్రయించడం తయారుచేయడం తండాలలో నేటికీ కొనసాగుతోంది. అందులో భాగంగా మండలం లోని తండా ప్రాంతాల నుంచి గుడుంబా తయారు కేంద్రాలు రోజురోజుకు పెరిగి తయారుచేసిన సరుకును ద్విచక్రవాహనాలపై మండలవ్యాప్తంగా విక్రయిస్తున్నార ని చెప్పారు. గుడుంబా విక్రయం రోజురోజుకూ పెరిగి మండలం మొత్తం చాపకింద నీరులా ప్రతి గ్రామంలో గుడుంబా విక్రయాలు పెరిగాయి. కల్తీ గుడుంబా సే వించిన గుడుంబా ప్రియులు అనారోగ్యం పాలవుతు న్నారని దీనిపై ఎక్సైజ్ పోలీస్ శాఖ వారు ఎలాంటి దా డులు, కేసులు గాని నమోదు చేయడంలేదన్నారు. ఎప్పుడో ఒకప్పుడు నామమాత్రపు దాడులు చేసి చేతు లు దులుపుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులు అధి కారులు గుడుంబా తయారీ కేంద్రాలను నిలువరించ లేక పోతున్నారని విమర్శలు అధికంగా ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ నిఘా లేకపోవడంతో గుడుంబా వ్యాపారం జోరుసాగుతోంది. ఎనీటైం గుడుంబా లభ్యం కావడం తో గుడుంబా ప్రియులు సేవించి అనారోగ్యం పాలై లివర్ సంబంధిత వ్యాధులతో ఆస్పత్రుల చుట్టూ తిరు గుతూ సర్వం ఆస్తులు కోల్పోయినా నయంకాకపోవ డం తో మృత్యువాత పడుతున్నారని చెప్పారు. దీంతో ఆ కు టుంబాలు రోడ్డున పడుతూ పిల్లలు అనాథలై తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని మహిళా సంఘాలు ఆ రోపిస్తున్నాయి. గీత కార్మికులు మాట్లాడుతూ గుడుంబా బెల్టుషాపుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని చెప్పారు. దీనిపై వెంటనే జిల్లా సంబంధిత ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు వారు చొరవ తీసుకొని గుడుం బా కేంద్రాలపై దాడులు జరిపి, గుడుంబా విక్రయాలను అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని మహిళా సంఘా లు ప్రజలు గీత కార్మికులను వేడుకుంటున్నారు.