Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలోని మారు మూల గ్రామాలలో అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌లను రోటరీ క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కష్ణ ఆదిత్యను కలిసి అందజేశారు. ఒక్కో అంబులెన్స్ 1లక్షా 80 వేల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రోటరీ క్లబ్ వారిని అభినందించారు. భవిష్యత్‌లో కూడా రెండు జిల్లాల్లో పేదవారికి వైద్య సేవలు అందించేందుకు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వారు వైద్య సేవలను అదించేందుకు, ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధమని అవసరమైన వైద్య పరికరాల కొరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ఆఫ్ వరంగల్ ప్రెసిడెంట్ ఆనందరావు, సెక్రటరీ శివప్రసాద్, ట్రెజరర్ రమేష్ బాబు, కాళోజి హెల్త్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా పౌరసంబంధాల అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.