Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- హన్మకొండ
ఓరుగల్లు వేదికగా ఎంపీటీసీలు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. రెండు సంవత్సరాలుగా నిధులు, విధులు, అధికారం కావాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంద ని ఇప్పటికైనా తమ సమస్యలు వెంటనే పరిష్కరించక పోతే రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 800మంది ఎంపీటీసీలం పోటీచేసి తమసత్తా ప్రభుత్వానికి చాటుతామని ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేం వాసుదేవ రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో ఎంపీటీసీల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీటీసీల ఫోరం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. గతంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత తమ కష్టాలు తీరుస్తారని, తమ గళాన్ని ప్రభుత్వం వద్ద వినిప ిస్తారని గెలిపిస్తే అవేమీ జరగలేదన్నారు. తనపై అభి మానంతో ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తమకు నేడు ఒరి గిందేమీ లేదని చెప్పారు. ప్రభుత్వం తమను పట్టిం చుకున్న పాపాన పోవడం లేదని, గ్రామాల్లో వార్డు సభ్యుడికి ఉన్న విలువ తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేక, ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయమన్నారు. గౌరవ వేత నాన్ని 30 శాతం పెంచి అవమానించారని, పల్లె, పట్టణ ప్రగతిలో కనీస ప్రాధాన్యత ఇవ్వాలేదని మండిపడ్డారు. నిధులు లేనప్పుడు తామేందుకని? తమను గెలిపించిన ప్రజల కోసం ఏ చేయాల్సిన అవసరం లేదా అని ప్రశ్నిం చారు. ఆత్మహత్య చేసుకున్న ఎంపీటీసీల కుటుం బాల ను పరామర్శించే దిక్కే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హుజూరాబాద్‌లో ఓట్ల కేసమే దళిత బంధు తీసుకొచ్చారని వాసుదేవరెడ్డి ఆరోపిం చారు. కేసీఆర్ దళితులకు చేసిన మోసాన్ని హుజూరా బాద్‌లోని ఇంటింటికీ వెళ్లి ఎంపీటీసీలమంతా ప్రచారం చేస్తామని చెప్పారు. ఈటల రాజేందర్ అసైన్డ్ భూము లు ఆక్రమించారని కేసులు పెట్టిన ప్రభుత్వం మరిఎంత ఆక్రమించారో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
అప్పుల పాలైన తెలంగాణ
కల్వకుంట పాలనలో తెలంగాణ అప్పుల పాలు అయిందని వేం వాసుదేవ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో అవేమీ సాధ్యం కాలేదన్నారు. కేవలం సీఎం కేసీఆర్ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇంటికో పెన్షన్ ఇస్తానన్న సీఎం అవి ఇవ్వకపోగా ఇంటి నిండా టెన్షన్లు నింపారని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కార్యాచరణ
మరో రెండు మూడు రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమావేశం కావడమే కాకుండా, రాష్ట్ర కమిటీతో భేటి అయి కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమావేశంలో వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు కమలాపురం రమేశ్, అర్బన్ జిల్లా అధ్యక్షుడు సంపత్, గుడెప్పాడ్ ఎంపీడీసీ రజినీకర్ రెడ్డి, అక్కంపేట ఎంపీటీసీ పోగుల ఇందిర రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.