Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ పిట్టల ప్రభాకర్ కుటుంబానికి సహచర కార్మికులు ఆర్థిక సహాయాన్ని అందజేసి ధాతృత్వాన్ని చాటారు. శుక్రవారం ఆర్టీసీ డిపో ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ బీ.శ్రీనివాసరావుచే ఈ మేరకు 278 మంది కార్మికుల వద్ద సేకరించిన రూ.1లక్ష 62వేల98లను ప్రభాకర్ కుటుంబానికి అందజేశారు. కరోనాతో అకాల మృత్యువాత పడిన ప్రభాకర్ కుటుంబాన్ని సహచర కార్మికులు ఆర్థిక సహా యాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ప్రభాకర్ కొన్నాళ్ల గా నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తు న్నాడు. ఇటివల కరోనాతో తీవ్ర అస్వస్తతకు గురై మృతిచెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వేతనంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోవడంతో సహచర కార్మి కులు స్పందించారు. డిపో మిత్ర బందం బాధ్యులు గొలనకొండ వేణు, సార నగేష్, బొడిగె రాజు ముందడు గు వేశారు. డిపోకి సంబంధించిన రెండు వాట్సప్ గ్రూప్‌లలో గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా విరాళాలు సేకరించినట్లు తెలిపారు. ప్రభాకర్ కుటుం బానికి ఆర్థిక సహాయాన్ని అందజేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీహరి, అసిస్టెంట్ మేనేజర్ సరస్వతి, శాంతమ్మ, మేకల కుమారస్వామి, శ్రీనివాస్, చారీ, రాజన్న, మహేందర్, వేముల రవి, వెంకటేశ్వర్లు, రాజాలు పాల్గొన్నారు.