Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ షాక్ తో జెర్సీ ఆవు మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలోని గోవిందాపూర్ గ్రామంలో చోటుచేసు కుంది. బాధిత రైతు బొత్తా రవీందర్ కథనం ప్రకారం.. గోవిందాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ పక్క రాష్ట్రాల నుంచి జెర్సీ ఆవులను కొనుగోలు చేసి పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తన ఇంటి వెనకాల ఆవు మేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగ తెగి పడి ఒక జెర్సీ ఆవు అక్కడికక్కడే మత్యువాత పడింది. గమనిం చిన స్థానికులు విద్యుత్ సిబ్బందికి సమాచారం అందిం చడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సంఘటన స్థలాన్ని సర్పంచ్ బైరి శ్రీనివాస్, ట్రాన్స్కో ఏఈ రాజమౌ ళి పరిశీలించారు. జెర్సీ ఆవు మృతితో లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రతిరోజూ 10 లీటర్లు పాలు ఇస్తుం దని బాధితుడికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు.