Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వర్ధన్నపేట
మహిళలకు ఉపాధి కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్ అంగోతు అరుణ సూచించారు. శుక్రవారం పట్టణ కేంద్రంలో జై భీమ్ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ విభాగాలలో ఉచితంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని పౌండేషన్ అధ్యక్షుడు జన్ను రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత శిక్షణ ఉపాధి కార్యక్రమం చాలా మంచి అవకాశమని జై భీమ్ పౌండేషన్ చైర్మన్ జన్ను రాజు. వర్ధన పేట మండల కేంద్రంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం, మహిళల్లో ఆత్మస్థైర్యం నింపడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడం ఈ రోజుల్లో చాలా అవసరమని అన్నారు. కేయూ ప్రొఫెసర్ రమా మాట్లాడుతూ ఆన్లైన్ లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ప్రస్తుతం ఈ రోజుల్లో తప్పనిసరి, తనవంతుగా 500 మందికి ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తానని ఆసక్తి ఉన్నవారు జై భీమ్ ఫౌండేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జై భీమ్ విద్య ఫౌండేషన్ చైర్మన్ జన్ను రాజు, కౌన్సిలర్స్ తోటకూరి . రాజమణి, సుధీర్, ఎంజీఎం స్టాఫ్ నర్స్ నరసమ్మ కంజర్ల మహేష్, పోలీస్ రవీందర్, సంధ్య, జ్యోతి, సౌజన్య, రేణుక, కవిత, హుస్సేన్, కష్ణారెడ్డి, సోమన్న, వెంకన్న పాల్గొన్నారు.